ఈ ఏడాది ప్లీనరీకి మొహం చెల్లడం లేదేమో!

సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి ఏడాదీ తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిపోయిన సంవత్సరాల్లో ఇలాంటి ఉత్సవాలకు దూరంగా ఉంటాయి. ఓడిపోయిన ఏడాదికూడా వేడుకలు చేసుకుంటే జనం నవ్వుతారని వారికి గుంజాటన ఉంటుంది. అందుకే అప్పుడప్పుడూ స్కిప్ చేస్తుంటారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత రెండో ఏడాది కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, ప్లీనరీని నిర్వహించుకోడానికి భయంగానే ఉన్నట్టుంది. తాజాగా ఆయన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తూ.. వచ్చే ఏడాది జులై 8న పార్టీ ప్లీనరీని చాలా ఘనంగా నిర్వహించుకుంటాం అంటూ సెలవిచ్చారు.

ఇంతకూ పార్టీ వేడుకను జరుపుకోవడానికి వచ్చే ఏడాది దాకా ఆగడం ఎందుకనేది ప్రజల మదిలో మెదలుతున్న సందేహం. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అత్యంత నీచంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆ అవమాన భారంతో జగన్ కుతకుత ఉడికిపోతున్నారు. అప్పటినుంచి జనానికి మొహం చూపించుకోలేక ఇప్పటిదాకా ఏడాది అవుతుండగా.. ఒక ప్రజాకార్యక్రమంలో అయినా ఆయన స్వయంగా పాల్గొనలేదంటే అతిశయోక్తి కాదు. పెళ్లిళ్లు చావులకు తప్ప ఏకార్యక్రమానికీ వెళ్లకుండా.. వారంలో సగం రోజులు బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోనే రోజులు వెళ్లదీస్తున్నారు. ఇంతటి అవమాన భారం గత ఏడాదిలోనే ఎదురైన తర్వాత.. అదే ఏడాదిలో ఆయన పార్టీ ప్లీనరీ వేడుకలు నిర్వహించుకుంటే.. నవ్వులపాలు అవుతామనే భయంతో ఆయన వాటికి దూరం ఉండిపోయారు. ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావడానికి జగన్ చేసిన గట్టి చర్య ఒక్కటి కూడా లేదు. పార్టీ కమిటీలను పదేపదే మారుస్తూ.. మీరే రేపటి ఆశాకిరణాలు అని ప్రతిసారీ అనడం తప్ప.. ప్రతి మీటింగులోనూ చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది అనడం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు. కనీసం చతికిలపడిన పార్టీలో జోష్ తీసుకురావడానికి సంక్రాంతి నుంచి ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తానని.. ఒక్కో చోట రెండేసి రోజులు గడుపుతానని మాట ఇచ్చిన జగన్.. దాన్ని పట్టించుకోలేదు. అసలు ప్రజల ముందుకు వెళ్లడానికే ఆయనకు మొహం చెల్లడం లేదు. ఏడాది గడిచిపోతున్నా.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వంటిది నిర్వహించి.. పార్టీని ఫుల్ గేర్ లో యాక్టివేట్ చేయడానికి కూడా ఆయన భయపడుతున్నట్టుగా ఉంది.

ఈ ఏడాది సంగతి మాట్లాడకుండా.. వచ్చే ఏడాది జులై 8న పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తాం.. ఆ సభలోనే ఎన్నికల శంఖారావం పూరిస్తాం అని జగన్ ప్రకటించడం చాలా కామెడీగా ఉంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీనుంచి వెళ్లిపోతూ.. ఎవరి దారి వారు చూసుకుంటూ ఉండగా.. జగన్ వచ్చే ఏడాది ప్లీనరీ నిర్వహించేదాకా అసలు పార్టీ మిగిలుంటుందా అని జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories