పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాతో పాటు హిస్టారిక్ పీరియాడిక్ మూవీ కూడా కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా నిలవగా పవన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అంతకంతకు చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇంకా తనపై నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ బాలన్స్ ఉన్న నేపథ్యంలో పవన్ ఎట్టకేలకి మళ్ళీ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యినట్టుగా తెలుస్తుంది. నేటి నుంచే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్స్ లోకి వచ్చారంట. సో ఈ కొన్ని రోజుల్లో తన షూట్ అయ్యిపోతే సినిమా మొత్తం పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. అలాగే ఈ తర్వాత కొత్త డేట్ ని చిత్ర బృందం ప్రకటించనున్నారు.