బన్నీ మూవీలో మరో హీరో!

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది ?, ఎప్పుడు విడుదల అవ్వనుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తోంది.

ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రానుందని తెలుస్తుంది. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉండనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories