కోవిడ్ తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ రంగంపై ఈ ప్రభావం భారీగా పడింది. థియేటర్లకు జనాలు రావడం చాలా వరకు తగ్గించారు. పెద్ద, చిన్న సినిమాలతో సంబంధం లేకుండా జనాలతో కిక్కిరిసిపోయిన థియేటర్లు వెలవెల బోతున్నాయి. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి కూడా. కోవిడ్ నుంచి కోలుకున్నా కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఓ కారణం.
ఈ విషయంపై ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఓటీటీలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఓటీటీల వ్యాపార శైలి ఏమాత్రం ఆమోదయోగంగా లేదని ఆయన తెలిపారు. ఓ వస్తువుని తన వద్ద కొనాలని తాను కోరినా, వినియోగదారులు రాక,ఆ వస్తువును కొనకపోవడంతో.. అదే వస్తువును 8 వారాల్లో వారి ఇంటి ముందుకు తీసుకొచ్చి పెడతానంటూ అమీర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఓటీటీల బిజినెస్ శైలి మారడం చాలా అవసరం అని.. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తేనే వారికి పూర్తి ఆనందం ఉంటుందని ఆయన తెలిపారు. ఏదేమైనా ఓటీటీలపై ఇలా ఓ బాలీవుడ్ స్టార్ హీరో మండిపడటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.