తెలుగు బుల్లితెర ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతో దగ్గరైన యువ యాంకర్స్ లో యాంకర్ ప్రదీప్ ఒకరు. అయితే ప్రదీప్ బుల్లితెర నుంచి వెండి తెరపైకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా తన నుంచి రీసెంట్ గా వచ్చిన రెండో సినిమానే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.
అదే బుల్లితెర నటి దీపికా పిల్లి కథానాయిక గా ‘ఢీ’ షో డైరెక్టర్ నితిన్, భరత్ లు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి విడుదలకి రెడీ అయ్యింది.
ఈ సినిమా హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 8 నుంచి అందుబాటులోకి రానుంది అని ఈటీవీ విన్ వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఇంకొన్ని రోజుల్లో ఈటీవీ విన్ లో వీక్షించవచ్చు.