రేసు నుంచి తప్పుకున్న దసరా..!

నాచురల్ స్టార్ నాని ఇపుడు తెలుగు సినిమా దగ్గర తన మార్కెట్ ని ఏ రేంజ్ లో సెట్ చేసుకొని వెళుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇలా ఈ మధ్య కాలంలో తన నుంచి వచ్చిన చిత్రాల్లో “దసరా” ఒక భారీ హిట్ గా నిలిచి తన కెరీర్లోనే కాకుండా మన మిడ్ రేంజ్ హీరోస్ సినిమాల్లో ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే ఇపుడు మళ్ళీ ఈ చిత్రాన్ని నాని మాత్రమే బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్‌ చేసుకున్నాడు.

దసరా చిత్రానికి వరల్డ్ వైడ్ మొదటి రోజు 38 కోట్లు గ్రాస్ ని అందుకుంటే ఇపుడు హిట్ 3 కి మొదటి రోజు 43 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సెన్సేషన్ ని సెట్ చేసింది. దీంతో నాని కెరీర్లో ఇది ఆల్ టైం హైయెస్ట్ రికార్డుగా నిలిచింది. ఇక ఈ వీకెండ్ నాటికి సినిమా ఈజీగా 150 కోట్ల దగ్గర మార్క్ కి చేరుకున్నా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. మరి మొత్తానికి అర్జున్ సర్కార్ కొట్టిన దెబ్బ మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories