తెలుగు సినిమా హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి చిరంజీవి హీరోగా తెలుగు సినిమాకి అలాగే ఇండియన్ సినిమాకి కూడా ఎంతో కృషి చేశారు. ట్రెండ్ కి తగ్గట్టుగా ఆయన ఫైట్లు, డాన్స్ లు లాంటివి ఇండియన్ సినిమా దగ్గర ఎంతోమందికి ప్రేరణ అయ్యాయి.
ఇలా తెలుగులో ఎన్నెన్నో కొత్త ప్రయత్నాలు చేసి ఇండియన్ సినిమాని తన వైపు తిరిగేలా తాను చేశారు. అయితే తనపై లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తెలుగు సినిమాకి చిరంజీవి డాన్స్ లు, క్రమశిక్షణ అలాగే హీరోయిజం వంటివి ఆయనే తీసుకుని వచ్చారు అనడంలో అతిశయోక్తి లేదంటూ అక్షయ్ లేటెస్ట్ వేవ్స్ సమిట్ లో చెప్పారు. దీంతో తన కామెంట్స్ మెగాస్టార్ పై వైరల్ గా మారాయి.