టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుంది.
అయితే, ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి తాజాగా బ్రేక్ ఇచ్చాడు. ఈ బ్రేక్ దాదాపు 40 రోజుల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రం కావడంతో చిత్ర యూనిట్‌కు ఆయన సెలవునిచ్చారు.
ఇక ఈ బ్రేక్‌లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.