చరణ్‌ హీరోయిన్‌ కి ట్విన్స్‌!

స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.

దీంతో ప్రజంట్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్‌లు అందుకుంటుంది. ఇక హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న కియారా 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.

కాగా ప్రజంట్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లో బేబీ బంప్ ఫోటోలు కనిపించడంతో ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుందని నెటిజన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఆమె ఇంటర్వ్యూలో పాల్గొని..‘నాకు ఇద్దరు ఆరోగ్యమైన వంతమైన పిల్లలు కావాలి.

అందులో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి కావాలని’ కోరుకుంది. దీంతో ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories