నాని జాక్‌పాట్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు నాని సిద్దమవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న హిట్-3 ఇప్పటికే లాభాల బాట పట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే చిత్ర ప్రొడక్షన్ ఖర్చు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇక థియేటర్స్ నుంచి వచ్చేది మొత్తం లాభమే అవుతుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్. హిట్-3 కి ముందు నాని ప్రొడ్యూస్ చేసిన ‘కోర్ట్’ విషయంలో ఇదే జరిగింది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నాని జాక్‌పాట్ కొట్టి తన పవర్ ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెడుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఇక శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్-3 చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories