సినిమా వరకు పలు సీజన్స్ ఆడియెన్స్ కి అలాగే ఇండస్ట్రీకి కూడా బాగా కలిసొస్తాయి. అలాంటి లాంగ్ సీజన్స్ లో వేసవి కాలం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మన తెలుగుచిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది లో కూడా సమ్మర్ సీజన్ లో అనేక సినిమాలు సందడి చేయడమే కాకుండా సాలిడ్ లాంగ్ రన్ ని కూడా చూస్తూన్నాయి. కానీ గడిచిన కొన్నాళ్ళు వెనక్కి చూసుకుంటే ఇవన్నీ ఎంతగానో మిస్ అవుతున్నామని తెలుస్తుంది. ఎక్కడ వరకు ఎందుకు ఈ 2025 ఏడాదిలో కూడా సరైన సినిమాలు పడటం లేదని తెలుస్తుంది.
గత నెల మ్యాడ్ స్క్వేర్ మినహా సాలిడ్ హిట్ కోసం ఆడియెన్స్ ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా థియేటర్స్, ఆడియెన్స్ దాహం తీర్చడానికి వస్తున్న సినిమాలుగా నాని హిట్ 3 అలాగే సూర్యుల రెట్రో లని చెప్పొచ్చు. రెండు చిత్రాలపైనా మంచి బజ్ రెండు భాషల్లో నెలకొంది. కేవలం టాక్ ఒకటి వస్తే మాత్రం ఆడియెన్స్ దాహం తీరినట్టే అని తెలుస్తుంది. ఆల్రెడీ సాలిడ్ బుకింగ్స్ ఈ సినిమాలకి ఉన్నాయి. సో జస్ట్ టాక్ ఒక్కటీ వస్తే సరిపోతుంది అని చెప్పొచ్చు.