ఎల్లమ్మ కు ఆ హీరోయిన్‌ కూడానా!

‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడు వేణు యెల్దండి. పూర్తి ఎమోషనల్ డ్రామా చిత్రంగా ‘బలగం’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భారీ విజయం సాధించింది. ఇక ఆ సినిమా తర్వాత ‘ఎల్లమ్మ’ అనే సినిమాను తెరకెక్కించేందుకు వేణు రెడీ అవుతున్నాడు.

నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మాత్రం ఇంకా ఎవరూ సెట్‌ కాలేదు. గతంలో ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు జోరుగా వినపడ్డాయి. కానీ, ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా ఈ చిత్రాన్ని ఓకే చేయలేదు. ఇక రీసెంట్‌గా ఈ మూవీలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు షికారు చేశాయి.

అయితే, ఇప్పుడు ఆమె కూడా ఈ సినిమాకు నో చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకతుందట. దీంతో ఈ సినిమాను ఆమె వదులుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ‘ఎల్లమ్మ’ను కీర్తి పక్కనబెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories