మాట్లాడకపోతే ఏమీ తోచదు!

హీరో మోహన్‌లాల్‌ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ ఇటు తెలుగు ప్రేక్షకుల్నీ సైతం తనవైపు చూసేలా చేసుకున్నారు.  అయితే, తాజాగా ఆయన కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నలభై ఎనిమిదేళ్ల కెరీర్‌లో నేను సినిమాను ప్రేమించినంతగా దేన్నీ ప్రేమించలేదు. ఒక సినిమా సెట్స్‌ మీద ఉండగానే నాలుగైదు చిత్రాలకు సంతకం చేస్తాను. నిజానికి నాకు విశ్రాంతి తీసుకోవడం, ఖాళీగా ఉండటం ఇష్టముండదు. అందుకే, ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉంటాను’ అంటూ మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.

మోహన్ లాల్ తన కోరిక గురించి మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి నా ప్రాణ స్నేహితుడు. తనతో కలిసి సుమారు యాభై సినిమాల్లో నటించాను . ఇంకా మరిన్ని చిత్రాల్లో కలిసి పని చేయాలనేదే నా ఆశ. రోజుకి ఒక్కసారైనా తనతో మాట్లాడనిదే నాకేమీ తోచదు. మా మధ్య పోటీ ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ, మా మధ్య మంచి స్నేహం ఉంది’ అని మోహన్ లాల్ చెప్పారు. అలాగే, తాను అయ్యప్ప స్వామి భక్తుణ్ని. అప్పుడప్పుడు మాల వేసుకుని.. కాలినడకన శబరిమల వెళ్లి ఇరుముడి సమర్పించి వస్తుంటా’ అని మోహన్ లాల్ తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories