‘కింగ్‌డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేస్తుందోచ్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో విజయ్ దేవరకొండ యాక్ట్‌ చేస్తున్న ‘కింగ్‌డమ్’ కూడా ఒకటి. ఈ మూవీని  డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల కాగా, దానికి మంచి రెస్పాన్స్ అందిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాను నుంచి మరో తాజా అప్డేట్‌ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. కాగా, ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె రైల్వే స్టేషన్‌లోని ఓ బెంచ్‌పై కూర్చున్నట్లు చూపించారు. అయితే వారి ముఖాలు మాత్రం ఇందులో చూపించలేదు.

ఈ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా అందించాడని. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇక ఈ సినిమాను మే 30న గ్రాండ్ గా విడుదల  చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories