హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ముగియడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
అయితే, ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ఓ ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు కానుకగా ఈ సినిమాలోని ఆయన లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. 1950ల కాలంలో జరగబోయే ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ లుక్తో ఆలరించనున్నారు.
ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి ప్రొడ్యూ్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.