ఆ విషయంలో జగన్.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా..!

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా.. మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకు కొత్త కాదు. వైఎస్  జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఇలాంటి వేదాలు అధ్యయనం చేయడంలో ఘనాపాటిగా ముద్రపడిపోయారు. అందుకే తన కారణంగా రాష్ట్రప్రభుత్వ ఖజానా మీద పడిన వందల వేల కోట్ల భారాన్ని కూడా కూటమి ప్రభుత్వం మీదికి నెడుతూ.. తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన నాటి అవనీతికి, అక్రమాలకు, అరాచకాలకు ప్రతిబింబం అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరొక్కరుగా జైళ్లకు వెళుతుండగా.. తన వంతు ఎప్పుడు వస్తుందో అనే భయంతో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో తోస్తున్నట్టు లేదు. రాజధాని అమరావతిలో ఇప్పుడు నిర్మాణాలు మొదలు కాబోతుండగా.. ఆ టెండర్ల వ్యవహారంపై  బురద చల్లడానికి సాహసిస్తున్నారు.

అయిదారేళ్ల కిందట అమరావతిలో పనులకు పిలిచిన టెండర్ల ధరలకంటె ఇప్పుడు ఆమోదించిన టెండర్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. అదేదో తాను సుదీర్ఘ పరిశోధన కావించి, కొత్తగా కనిపెట్టిన విషయం అన్నట్టుగా జగన్ చెబుతుండడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన కారణంగా.. టెండరు ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే సంగతి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కొన్ని నెలల కిందటే చెప్పారు. అందులో ఇప్పుడు కొత్తగా జగన్ చెప్పేది ఏముంది? అయినా.. ఇప్పుడు అధిక ధరలకు అదే పనులు చేయాల్సి వస్తున్నదంటే.. అయిదేళ్ల పాటూ ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక పెట్టిన నిర్మాణం అయినా చేయకుండా.. 54 వేల ఎకరాలను మరుభూమిగా మార్చేయదలచుకున్న జగన్మోహన్ రెడ్డి కుట్రల పర్యవసానమే కదా.. అని జనం నిప్పులు చెరగుతున్నారు.
ఇప్పుడు కూటమి సర్కారు అమరావతి పనులను శరవేగంగా చేయించే కసరత్తులో ఉండేసరికి.. తన కుట్రలు ఫలించలేదనే కుటిలబుద్ధితో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అమరావతిలో వివిధ నిర్మాణ పనులు దక్కించుకున్న వారిలో సగానికి పైగా జగన్ పాలన కాలంలో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలే ఉన్నాయి. అయినా.. జగన్ వాస్తవాల్ని దాచిపెడుతూ.. తన సొంత మనుషులకే చంద్రబాబు కాంట్రాక్టులు అప్పగించారని.. వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి అందులోంచి వాటాలు తీసుకుంటున్నారని తప్పుడు నిందలు వేస్తున్నారు.

అయినా.. అమరావతిలోనే  సొంత ఇల్లుకట్టుకున్నా అని కల్లబొల్లిమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి.. తన పదవీకాలంలో ఆ పనులన్నీ పూర్తి చేసి ఉంటే, ఇవాళ ఇలా  ఆవేదన చెందే పనే లేదు కదా! అప్పుడు విస్మరించిన ఆయనకు ఇప్పుడు ప్రశ్నించే హ క్కు ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories