స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ‘ట్రాలాలా’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత తొలి సినిమాగా ‘శుభం’ అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేసేందుకు సమంత ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌పై సామ్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.
‘శుభం’ ట్రైలర్.. ఏరోజైనా.. ఎప్పుడైనా రావచ్చు.. అంటూ సామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.