తాము చేసిన పాపాల మీద కేసులు నమోదు అయితే.. రాజకీయ వేధింపులు అంటూ అడ్డగోలుగా విమర్శలు చేయడం.. అక్కడికేదో తాము పరిశుద్ధాత్మ స్వరూపులు అయినట్లుగా కేసులు పెట్టిన వాళ్ళు దుర్మార్గులు అయినట్లుగా బిల్డప్ ఇవ్వడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. అబద్ధాలను కూడా పాలకపక్షం మీద నిందలుగా సంధించడానికి వారు వెనుకాడ లేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి వక్రంగా వేసిన నిందలు వారి మెడకే చుట్టుకుంటున్నాయి.
3000 కోట్ల రూపాయల పైబడిన మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన పేరు నిందితుల జాబితాలో తొలుత చేర్చలేదు. ఆయనను విచారించి పంపిన తర్వాత కూడా చేర్చలేదు. మిథున్ రెడ్డి పాత్రను చాలా స్పష్టంగా చెప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం తరువాత మాత్రమే.. మిథున్ రెడ్డి పేరు నిందితుల జాబితాలోకి చేరింది.
అయితే ఈ సందర్భంగా తాను విచారణకు హాజరైనప్పుడు మిథున్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి. రాజకీయ వేధింపుల్లో భాగంగా మాత్రమే తమ కుటుంబం మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆయన రెచ్చిపోయారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తొలుత మదనపల్లె ఫైల్స్ దహనం కేసు అంటూ మొదలు పెట్టారని, అక్రమ మైనింగ్, అటవీ భూముల కబ్జాలంటూ రకరకాల కేసులు పెట్టారని ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని.. మిథున్ రెడ్డి ప్రవచించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ వారి మీద పెట్టిన కేసులు అక్రమమైన అంటూ అధికార పార్టీకి వక్ర ప్రయోజనాలు పులిమే ప్రయత్నం చేశారు. 50 ఏళ్ల కిందట యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుటుంబం మీద కేసులు పెట్టిస్తున్నారు అంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయినా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పేరు నిందితుల జాబితాలో ఉంటే రామచంద్రారెడ్డి మీద కక్ష తీర్చుకున్నట్టు ఎలా అవుతుంది? అని ప్రజల సందేహించారు. అయితే జగన్ మాటల ముచ్చట తీరేలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉంటుందని అనుమానిస్తున్న మదనపల్లె భూ రికార్డుల ఫైల్స్ దహనం కేసు విచారణ ఇప్పుడు టాప్ గేర్ లోకి వచ్చింది. ఆయన కీలక అనుచరుడు పోలీసులు అదుపులోకి వచ్చాడు. అతని ద్వారా ఈ ఫైల్స్ దహనం వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఎంత ఉన్నదో త్వరలోనే బయటకు వస్తుందని ఆశిస్తున్నారు. ఆల్రెడీ ఫైల్స్ దహనం కేసు తర్వాత దేశం విడిచి పారిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎ కోసం కూడా పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నారు. మొత్తానికి మిథున్ రెడ్డి జగన్ రెడ్డి ఏదైతే ముచ్చట పడ్డారో.. ఆ రకంగానే కేసులు నమోదు అవుతూన్నాయి. ఈ కేసుల విచారణ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత పాపాలు చేసిన నాయకులు అందరికీ దబిడి దిబిడే అని ప్రజలు అనుకుంటున్నారు.