గోరంట్ల నగ్నంగా కాల్స్ మాట్లాడ్డానికి కారణం ఇదేనేమో!

గోరంట్ల మాధవ్ అంటే ఎవ్వరికైనా సరే.. ముందుగా గుర్తుకొచ్చేది.. నగ్నంగా కూర్చుని ఒక మహిళతో సాగించిన అసభ్య వీడియో కాల్స్ వ్యవహారం మాత్రమే! గోరంట్ల మాధవ్ అంటే.. ఆయన ఒకప్పట్లో  పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టరు అని గానీ, అనంతపురం జిల్లా రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన నేత జేసీ దివాకర్ రెడ్డి మీదికి మీసం మెలేసి బూతులతో సవాళ్లు విసిరిన హీరో అని గానీ, జగన్ మోహన్ రెడ్డి దయతో హిందూపురం టికెట్ దక్కించుకుని ఎంపీగా వెలుగు వెలిగిన వ్యక్తి అనిగానీ.. కరవు ప్రాంతం అనంతపురం దశను మార్చిన కియా కార్ల పరిశ్రమ యజమానులను బూతులుతిట్టి బెదిరించిన వ్యక్తి అనిగానీ.. ప్రజలు తటాల్న గుర్తు తెచ్చుకోలేరు. వారికి అన్నింటికంటె ముందుగా ఆయన నగ్న వీడియో కాల్స్ లో సాగించిన సరస సంభాషణ మాత్రమే గుర్తుకొస్తుంది.
ఇప్పుడు సదరు గోరంట్ల మాధవ్ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో.. ఆయన అలా నగ్నంగా ఉండడానికి, కాల్స్ మాట్లాడడానికి వెనుక ఉన్న అసలు కారణం బయటకు వస్తోంది. కస్టడీలో విచారించే నిమిత్తం.. తనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకువచ్చి, వైద్య పరీక్షలు  కూడా చేయించి.. ఒకటి రెండు ప్రశ్నలు కూడా అడిగి.. లాకప్ లో పెట్టిన గుంటూరు పోలీసులకు ఆయన ఇంచుమించుగా ఇలాంటి అవకాశమే కల్పించారు. లాకప్ లో ఉంటూ.. తన దివ్యమంగళ దేహస్వరూపాన్ని వీక్షించే భాగ్యం పోలీసులకు ప్రసాదించారు. వీడియో కాల్ లో అవతలి మహిళతో సరసాలు మాట్లాడ్డానికి లాకప్ లోంచి పోలీసులకు చూపించిన తీరుకు మధ్య చిన్న తేడా ఉంది. ఈసారి ఆయన అండర్ వేర్ ధరించారు. సో, గుంటూరు పోలీసులను కొంచెం కనికరించారన్నమాట.
వైఎస్ భారతిపై అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని, అతడిని కొట్టి, పోలీసుల మీద దౌర్జన్యం కూడా చేసిన కేసులో గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. కస్టోడియల్ విచారణకు రెండురోజులకు అనుమతి లభించింది. అయితే.. రాజమండ్రినుంచి ఆయనను గుంటూరు తీసుకువచ్చి వైద్యపరీక్షల తర్వాత స్టేషనుకు తెచ్చేసరికి రాత్రి అయింది. ఏవో నాలుగు ప్ణశ్నలడిగి విచారణ పర్వాన్ని గురువారానికి వాయిదా వేసి.. ఆయనను లాకప్ లో పెట్టారు.

లాకప్ లో గోరంంట్ల మాధవ్ తన దుస్తులు విప్పేసి, కేవలం అండర్ వేర్ మీదనే కూర్చున్నారు. దీనిని పోలీసులు అభ్యంతర పెట్టగా.. తనకు గాలి ఆడడం లేదని, గాలి ఆడకపోతే ఏం చేయాలని.. ఆయన పోలీసులు తనదైన భాషలో ఎదురు ప్రశ్నించారు. దీనితో నివ్వెరపోవడం పోలీసుల వంతు అయింది. పాపం గోరంట్ల మాధవ్ కు వంటి మీద దుస్తులు ఉంటే శరీరానికి గాలి ఆడదని, వాటిని విప్పేస్తే తప్ప ఆయన మనశ్శాంతిగా ఉండలేరని.. నగ్న వీడియో కాల్స్ మాట్లాడి మాట్లాడి అలా అలవాటు అయిపోయిందని జనం నవ్వుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories