వైఎస్ భారతి పేరు అక్యూజ్డ్ లిస్టులోకి వస్తుందా?

రాజ్ కెసిరెడ్డి సిట్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. మద్యం కుంభకోణం గురించి ప్రాథమికంగా కొత్త పాలసీకి రూపకల్పన చేయడం దగ్గరినుంచి ప్రతి పనీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తానే చేసినట్టు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నారు. ఆ వాంగ్మూలం మీద ఆయన సంతకం చేయకపోయినప్పటికీ..  విషయం అయితే బయటకు వచ్చింది. బిగ్ బాస్, కింగ్ పిన్ ఎవరో.. చూచాయగా ప్రజల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ.. అనధికారిక క్లారిటీ వచ్చింది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును అక్యూజ్డ్ లిస్టులోకి చేర్చకుండానే మొత్తం 29 మంది పేర్లతో అక్యూజ్డ్ జాబితా తయారుచేశారు పోలీసులు!

కానీ, రాజ్ కెసిరెడ్డి విచారణ తర్వాత.. ప్రచారంలోకి వచ్చిన కొత్తపేరు.. అనేక అనూహ్య మలుపులును ఈ లిక్కర్ కుంభకోణానికి జతచేసే పరిస్థితి కనిపిస్తోంది. రాజ్ కెసిరెడ్డి తన వాంగ్మూలంలో.. తన వసూళ్ల నెట్ వర్క్ ద్వారా నెలకు 50-60 కోట్లరూపాయలు వసూలుచేసిన  తర్వాత.. దానిని సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులకు అందిస్తూ వచ్చినట్టుగా వెల్లడించారు. ఈ పేర్లన్నీ గతంలోనుంచి ప్రచారంలో ఉన్నవే. మరి ఈ బాలాజీ చుట్టూ ఇప్పుడు ఆసక్తి ఏర్పడుతోంది.

గోవిందప్ప బాలాజీ అనే ఆయన జగన్ భార్య వైఎస్ భారతికి అత్యంత నమ్మకస్తుడైన విధేయుడైన వ్యక్తి. ఆమెకు చెందిన భారతి సిమెంట్స్ లో ఫుల్ టైం డైరక్టరు! భారతి సిమెంట్స్ కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యవహారాలు అన్నీ ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. నిర్ణయాత్మకంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సజరుగుతుంటాయి.

ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సమర్పించుకుంటే.. ఆటోమేటిగ్గా ఆ సొమ్ము వైఎస్ జగన్ కు అందినట్టుగానే ఏ విధంగా అయితే భావించవచ్చో.. అదేరీతిగా ఇక్కడ కూడా! గోవిందప్ప బాలాజీకి ముడుపులు సొమ్ము అందజేయడం అంటే.. ఆటోమేటిగ్గా ఆ సొమ్ము వైఎస్ భారతికి అందినట్టుగానే పరిగణించవచ్చునన్న మాట.

లిక్కర్ కుంభకోణం చుట్టూ ప్రచారంలోకి వచ్చిన పేర్లలో విజయసాయి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ తదితరులందరినీ పోలీసులు ఇప్పటికే విచారించడం జరిగింది. రాజ్ కెసిరెడ్డి ఇప్పుడు వాళ్ల రిమాండులోనే ఉన్నాడు. ఇక గోవిందప్ప బాలాజీని కూడా పోలీసులు పట్టుకుని విచారించినట్లయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి నిందితుల జాబితాలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా లేదు. గోవిందప్ప బాలాజీ పేరు కూడా ప్రస్తుతానికి లేదు. వీరి పేర్లు జతకలిసే సమయానికి.. కనీసం వీరిని పిలిచి విచారణ పూర్తిచేసి వాంగ్మూలాలు నమోదు చేసే సమయానికి..  జగన్ పేరు, వైఎస్ భారతి పేరు కూడా అక్యూజ్డ్ లిస్టులోకి వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు. జగన్ తో పాటు, సహధర్మచారిణి వైఎస్ భారతికి కూడా ప్రాసిక్యూషన్ తప్పకపోవచ్చునని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories