మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా తన కెరీర్‌లో 31వ సినిమాను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ‘డ్రాగన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ మంగళూరుకు పయనమయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తూ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందిస్తున్నారు.