మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ తీర్చిదిద్దుతుండగా పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో షికారు చేస్తుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ కోసమే ఈ మూవీ బృందం ఏకంగా రూ.75 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఒక్క వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఇంత భారీ బడ్జేట్ కేటాయించడంతో ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష, అషికా రంగనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.