కూలీ కోసం శ్రుతి డబ్బింగ్‌!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ గురించి ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు  చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తాజాగా ఈ సినిమా కోసం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories