బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ గతంలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలనుకున్నాడని ఈ స్టార్ హీరోయిన్ అన్న మాటలు సంచలనం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ‘ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. అసభ్యంగా పిలిచాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను అసభ్యంగా పిలిచాడు. అతను నన్ను అలా అవమానించిన తర్వాత నేను అద్దంలో ఆరు నెలలు నా ముఖం కూడా చూసుకోలేదు’ అని విద్యాబాలన్ తెలిపింది.
విద్యాబాలన్ ఇంకా మాట్లాడుతూ… ‘ఆ సమయంలో ఆ నిర్మాత లాంటి కొందరు వ్యక్తులు మాట్లాడే మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అలాగే, ఒక సినిమా కోసం నేను బరువు పెరుగుతున్న సమయంలో బాడీ షేమింగ్ కి కూడా గురయ్యాను. ఒక సారి మలయాళంలో కూడా అవకాశం వచ్చింది. కానీ, ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో నన్ను దురదృష్టవంతురాలు అంటూ ప్రచారం చేశారు. మూవీ టీం ఆపేసిన అక్కడ నను బ్లెమ్ చేశారు. చెప్పుకుంటూ పోతే నా కెరీర్ లో ఇలాంటి చాలా ఉన్నాయి’ అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.