మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం తన మిత్రులు ఎవరు? అనే విషయంలో కంటె.. శత్రువు ఎవరు? అనే పాయింట్ మీద ఒక క్లారిటీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా తన భవిష్యత్ రాజకీయ అడుగులకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని మాత్రమే విజయసాయి అనుకుంటున్నారు. ఆ విషయం క్లియర్! ఏపార్టీలో చేరేది ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు గానీ.. ఆయన భారతీయ జనతాపార్టీలోకే వెళతారనే ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో.. ‘రాజ్యసభ ఎంపీ ఎన్నికల రేసులో తాను లేను’ అని చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ బిజెపి వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన రేసులో లేకపోవడం కాదు.. వాళ్లే రేసులోకి రానివ్వడం లేదు అని.. అంత సీన్ లేదని.. ప్రస్తుతానికి దూరం పెట్టారని తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల ఖాళీ అయిన ఎంపీ స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. భారతీయ జనతా పార్టీలో చేరి ఆ ఎంపీ టికెట్ ను కూటమి తరఫున ఆయనే దక్కించుకుంటారని ప్రజలు, మీడియా భ్రమించడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. బిజెపిలో అలాంటి రాజకీయాలే వర్కవుట్ అవుతున్నాయి. వైసీపీకి రాజీనామాచేసిన మరో ఎంపీ ఆర్.కృష్ణయ్య హఠాత్తుగా బిజెపి టికెట్ తో మళ్లీ ఎంపీ అయ్యారు. అందుకే విజయసాయి చుట్టూ అలాంటి పుకార్లు వచ్చాయి. బిజెపి అగ్రనాయకులతో ఆయనకున్న సత్సంబంధాలు ఇలాంటి పుకార్లకు ఊతమిచ్చాయి కూడా.
రెండు రోజుల కిందట లిక్కర్ స్కామ్ సిట్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మట్లాడినప్పడు.. రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. అలాగే.. తాను రాజకీయాల్లోకి మళ్లీ రావాలని అనుకుంటే గనుక.. తనకు ఎవ్వరి అనుమతి అక్కర్లేదని, ప్రజలు కావాలనుకున్నప్పుడు తాను వస్తానని అని ఆయన ఢంకా బజాయించి చెప్పారు.
తాజాగా మరోసారి.. ‘తాను రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో లేను’ అని విజయసాయి మరో మారు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎంపీ పదవి కాకుండా.. పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు ఆశిస్తున్నట్టుగా ఆయన కొందరు మీడియా మిత్రులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన రేసులో లేకపోవడం కాదు.. బిజెపినే ఆయనను ప్రస్తుతానికి దూరం పెట్టిందనేది అసలు సమాచారం. జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తుతం కక్ష పెంచుకుంటున్న విజయసాయిరెడ్డి.. జగన్ పతనం కోసం బి