‘నిత్యవిద్యార్థి’ చంద్రబాబుకు హేపీ బర్త్ డే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ తన 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ఆయన కేవలం తన కుటుంబ సభ్యుల మధ్యలో విదేశాల్లో జరుపుకుంటున్నారు. కుటుంబంతో మూడు రోజుల కిందట విదేశాలకు వెళ్లిన చంద్రబాబు సోమవారం తిరిగి వస్తారు. ఆయన జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగుమోపో డాట్ కామ్ కూడా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
కార్యదీక్ష, దక్షతల్లో తిరుగులేని నాయకుడు!

సమకాలీన రాజకీయ నాయకుల్లో చంద్రబాబునాయుడుతో సమానమైన కార్యదీక్ష, కార్యదక్షత గల నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే అత్యంత సుదీర్ఘంగా నాలుగుపదులు దాటిన రాజకీయ అనుభవం కలిగిఉన్న నాయకుల్లో ఒకరైన చంద్రబాబునాయుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. వర్తమానానికంటె కనీసం 20నుంచి వందేళ్ల ముందు పరిస్థితుల్ని కూడా తన ముందుచూపుతో దర్శించి.. దానికి తగినట్టుగా అభివృద్ధి పనులు ప్లాన్ చేసే దార్శనిక నాయకుడిగా చంద్రబాబుకు జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా.. రాజకీయ కుటిల బుద్ధులతో ఎవరు ఎన్నె కువిమర్శలు, వక్రవ్యాఖ్యానాలు చేసినప్పటికీ.. హైదరాబాదు నగరం ఇవాళ ఐటీ హబ్ గా విరాజిల్లుతున్నదంటే.. కేవలం చంద్రబాబునాయుడు పుణ్యమే అని చెప్పాలి. చంద్రబాబునాయుడు హైదరాబాదులో అడుగుపెడితే చాలు.. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ కార్యక్రమం ఉంటే చాలు.. పార్టీ రహితంగా ఇక్కడి ఉద్యోగాల్లో ఉండే యువతరం మొత్తం అక్కడకు పోటెత్తుతుంది. ఆధునిక ఐటీ విప్లవంలో కీలక భాగస్వామిగా హైదరాబాదు నగరానికి ఒక అంతర్జాతీయ గుర్తింపు ఏర్పడినదంటే అది చంద్రబాబునాయుడు రెక్కల కష్టం అనే చెప్పుకోవాలి. రాజకీయంగా లబ్ధి కోసం ఆయన ఆలోచనల్ని కొందరు పబ్లిక్ లో విమర్శించవచ్చు గానీ.. ప్రెవేటు సంభాషణల్లో మాత్రం.. ఇలాంటి ఆలోచనలు మాకెందుకు రావు.. మేమెందుకు ఇంత మంచి పనులు చేయలేకపోతున్నాం అని అంటూ ఉంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఏదైనా పట్టుదల పడితే.. దానిని పూర్తిచేసేవరకు విశ్రమించిన అనితర కార్యసాధకుడుగా చంద్రబాబుకు పేరుంది.

ఇప్పుడు అమరావతి విషయంలో, అనాథలా ఏర్పడిన ఏపీ అభివృద్ధి విషయంలో జరుగుతున్నది కూడా అదే. ఆయన తన మునుపటి కార్యదీక్షకంటె ఇనుమడించిన ఉత్సాహంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. 54 వేల ఎకరాల్లో ఆయన ఒక అపురూపమైన రాజధాని అమరావతిని స్వప్నించారు. కార్యరంగంలో దిగిన తొలి క్షణాల్లోనే ఆ స్వప్నానికి జగన్ రూపంలో రాహుగ్రహణం పట్టుకుంది. అయిదేళ్ల విరామం వచ్చింది. ఇప్పుడు మొత్తం రాజధానిని ఏకకాలంలో ఆయన నిర్మాణ పనులను మొదలు పెట్టిస్తున్నారు.
ఇప్పుడు ప్రారంభం కనుల ముుందు కనిపిస్తే.. మనందరికీ రేపటికి తయారయ్యే అమరావతి రాజధాని రూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ చంద్రబాబునాయుడు దార్శనికుడు గనుక..  ఆయనకు రేపటి రాజధానికి ఇంకా అవసరం కాగల అదనపు హంగుల అవసరం కూడా కనిపిస్తుంది. అందుకే ఆయన దార్శనికుడు అయ్యారు. అందుకే ఆయన అమరావతి కోసం ఓ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని, అలాగే దేశానికే అమరావతిని స్పోర్ట్స్ రాజధానిగా నిలబెట్టే స్పోర్ట్స్ సిటీని కూడా స్వప్నిస్తున్నారు. ఆయన కార్యదీక్షకు, దార్శనికతకు, కార్యదక్షతకు కూడా ఇవి నిదర్శనాలు.

నిత్య విద్యార్థి చంద్రబాబు
ఇంతటి కార్యదీక్షకు, దక్షతకు మూలాలు ఎక్కడున్నాయి. దానికి జవాబు చాలా సింపుల్. చంద్రబాబునాయుడు నిత్య విద్యార్థి. కొత్త విషయం అది ఎలాంటిదైనా సరే.. దానిని తాను తెలుసుకోవాలని, దాని గురించిన అవగాహన పెంచుకోవాలని, తనను తాను అప్ డేట్ చేసుకోవాలని ఆయన నిరంతరం పరితపిస్తుంటారు.
అందరూ ఆయనకు టెక్నాలజీ అంటే వ్యామోహం అని అనుకుంటారు. హైటెక్ ముఖ్యమంత్రి అని ఆయనను వ్యవహరిస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు. కొత్త విషయం ఏదైనా సరే.. ఆయన అది తన ఎదుటకు వచ్చినప్పుడు హఠాత్తుగా విద్యార్థిగా మారిపోతుంటారు. తాను సీఎం అని, తనకు ఒక దర్పం,  ఉండాలని మర్చిపోతారు. ఒక ఉదాహరణ చూద్దాం.. ఏదైనా ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని అధ్యయనం చేయడానికి ఆయన ఒక బృందాన్ని తీసుకుని విదేశాలకు వెళ్లారని అనుకుందాం. ఆ వ్యవసాయంలో ఉండే రైతు ఎదుట చంద్రబాబు విద్యార్థి అవతారం ఎత్తుతారు. ఆ రైతు చెప్పే సంగతులను జాగ్రత్తగా బుర్రలోకి ఎక్కించుకుంటూ మధ్య మధ్యలో సందేహాలు అడిగి నివృత్తి చేసుకుంటూ విషయాన్ని ఆకళింపు చేసుకుంటారు.  ప్రతి విషయాన్నీ మంచి విద్యార్థిలాగా ఆయన అలా నేర్చుకుంటారు కాబట్టే.. ఇంతటి కార్యదక్షుడిగా పాలన సాగించగలుగుతున్నారని ప్రజలు శ్లాఘిస్తున్నారు.

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న నిత్యవిద్యార్థికి శుభాకాంక్షలు!

Related Posts

Comments

spot_img

Recent Stories