మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ హీరోగా మరో టాలెంటెడ్ హీరో కం దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన భారీ సినిమా “ఎంపురాన్”. అయితే ఈ చిత్రం తమ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం లూసిఫర్ కి సీక్వెల్ గా వచ్చి మలయాళంలో రికార్డులు తిరగరాసింది. ఇలా డే 1 నుంచే సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు థియేటర్స్ లో 30 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా మొత్తం 30 రోజుల్లో రాబడి మేకర్స్ ప్రకటించారు. థియేట్రికల్ గా సహా నాన్ థియేట్రికల్ గా కూడా కలిపి 325 కోట్లకి పైగా అందుకున్నట్టుగా సమాచారం. దీనితో మలయాళ సినిమా దగ్గర ఈ సినిమా కొత్త రికార్డు సెట్ చేసింది. ఆల్రెడీ మోలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఈ చిత్రం నిలిచినా సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మంజు వారియర్ టోవినో థామస్ తదితరులు నటించగా లైకా సంస్థ, గోకులం సినిమాస్ వారు నిర్మాణం వహించారు.