నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “డాకు మహారాజ్” తో తన కెరీర్లోనే భారీ హిట్ సినిమాని సొంతం చేసుకున్నారు. ఇక దీనిని కూడా డెఫినెట్ గా బ్రేక్ చేసే మూవీ ఏదన్నా ఉంది అంటే అది తాను యాక్ట్ చేస్తున్న తాజా సినిమా “అఖండ 2” అని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2 పట్ల గట్టి హైప్ ఉంది.
పార్ట్ 1 థియేటర్స్ లో మన దగ్గర అదరగొడితే ఓటిటిలో వచ్చాక నార్త్ ఆడియెన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఇదిలా ఉండగా ఇపుడు పార్ట్ 2 పై ఓ క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీంతో అఖండ 2 చిత్రం విడుదల గురించి ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చింది. దీనిటి అఖండ 2 అనుకున్న సమయానికి రాకపోవచ్చట. మేకర్స్ సెప్టెంబర్ 25 కి ముందుగా ప్లాన్ చేశారు కానీ అఖండ 2 మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుంది అని సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఒక ఇంకా రావాల్సి ఉంది.