న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం బ్లడ్బాత్గా ఉండటంతో నాని ఈ సినిమాలో ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర్నుండి ఏకంగా 100 గంటల పాటుగా యూట్యూబ్‌లో టాప్ 1వ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను మే 1న గ్రాండ్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.