కేసులు పెట్టి విచారణ చేయించుకోవాలని.. ఏ విచారణకైనా తాను సిద్ధంగానే ఉంటానని.. ఆయనే స్వయంగా సవాళ్లు విసిరారు. తీరా ఇప్పుడు కేసు నమోదు అయిన తర్వాత.. తన మీద వంద కేసులు పెట్టినా భయపడేది లేదని.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటానని.. మీ పాలనలో అరాచకలాు ప్రశ్నించకపోతే పాపం అవుతుందని భూమన కరుణాకర రెడ్డి రెచ్చిపోతున్నారు. అయితే భూమన వ్యవహార సరళిని గమనిస్తే.. టీటీడీ నిండుగా ఉన్న తన రెండు వేల మంది కోవర్టులను అడ్డు పెట్టుకుని.. నిత్యం బురద చల్లుతూ ఉండడమే పనిగా ఆయన ఉండబోతున్నారని తెలుస్తోంది.
‘‘టీటీడీలో ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’’ అని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజానికి ఈ మాటల అర్థం.. ‘‘టీటీడీలో అసలు ఏం జరిగినా సరే.. అందులో నేను తప్పులెన్నుతూ ఉంటా’’ అన్నట్టుగా ఉన్నదని.. ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. టీటీడీలో మొత్తం తనకు రెండువేల మంది గూఢచారులు ఉన్నారని.. ఎక్కడ ఏం జరిగినా తనకు తెలిసిపోతుందని భూమన ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేసు రిజిస్టరు కాగానే.. భూమనలో కంగారు మొదలైనట్టుగా ఉంది. అందుకే కేసులకు భయపడేది లేదు.. వంద కేసులు పెట్టినా సరే.. ప్రశ్నిస్తూనే ఉంటా.. అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
భూమన కరుణాకర రెడ్డి.. ఇంట్లో కూర్చుని మరణించిన కొన్ని ఆవుల ఫోటోలు చూపించి.. గోశాలలో ఇవన్నీ చచ్చిపోయాయని చెప్పడం చాలా ఈజీ. కానీ పోలీసు కేసు రిజిస్టరు అయిన తర్వాత.. ఆ వ్యవహారం అక్కడితో ఆగదు. పోలీసులు అడిగినప్పుడు ఆ ఫోటోలను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీడియాకే ఇచ్చిన భూమన పోలీసులకు ఇవ్వడానికి వెనకాడకపోవచ్చు. కానీ వ్యవహారం అక్కడితో కూడా ఆగదు. ఆ ఫోటోలు ఆయనకు ఎక్కడినుంచి వచ్చాయో.. ఎప్పుడు తీశారో.. లాంటి వివరాలన్నీ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అవన్నీ నా పర్సనల్ వ్యవహారాలు నేను చెప్పను అంటే పప్పులుడకవు. ఫోటోలు ఎప్పుడు తీశారో తేలితే.. భూమన మాటల విశ్వసనీయత కూడా తేటతెల్లం అవుతుంది.
ఇప్పుడు టీటీడీ లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తులను ధార్మిక పరమైన విధుల్లో కాకుండా.. ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేసే కసరత్తును ప్రారంభించారు. టీటీడీలో పనిచేసే అన్యమతస్తుల కంటె.. ఇటువంటి భూమన కోవర్టులు చాలా ప్రమాదకారులు అని.. ఇలాంటి వారిని.. ముందుగా.. భక్తులకు సేవలందించే ముఖ్యవిధుల నుంచి దూరంగా బదిలీ చేయాలని లేకపోతే సంస్థనే భ్రష్టుపట్టించేస్తారని ప్రజలు అంటున్నారు.