జాట్‌ 2 పై సాలిడ్‌ అప్డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా మాస్ మూవీ “జాట్”.  తెలుగు డైరెక్టర్‌  గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సన్నీ డియోల్ అభిమానులకి మంచి ట్రీట్ ని అందిస్తుండగా వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ తో వసూళ్లు కూడా అందుకుంటుంది. ఇక ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని జాట్ 2 ని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

దీనితో సన్నీ అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్న సమయంలో ఈ పార్ట్ 2 పై గోపీచంద్ ఇచ్చిన స్టేట్మెంట్ మరింత  ఆసక్తి రేపింది. జాట్ 2 ని మరింత యాక్షన్ ఎలిమెంట్స్ సహా ఎమోషన్స్ తో తాను తెరకెక్కిస్తానని చెబుతున్నారు. అలాగే ఈసారి ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉండబోతుంది అని గోపీచంద్ చెప్పుకొచ్చారు. మొత్తానికి మాత్రం జాట్ 2 కూడా గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం 2027 కి వస్తుంది అన్నట్టుగా ఇపుడు టాక్.

Related Posts

Comments

spot_img

Recent Stories