ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అయితే ఇపుడు దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2 లో తాను బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా ఈ చిత్రం తర్వాత బాలయ్య ఎవరితో వర్క్ చేయనున్నారు అనేది ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.
తనకి వీర సింహా రెడ్డి లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన తరువాత సినిమాని చేస్తున్నట్టుగా గోపీచంద్ తాజాగా ప్రకటించారు.బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన గోపీచంద్ ప్రస్తుతం జాట్ సక్సెస్ తో నెక్స్ట్ సినిమాని వెంటనే బాలయ్యతో చేస్తున్నట్టుగా తాను తెలిపాడు. అలాగే ఈ సినిమాని బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ జూన్ 10న అనౌన్స్ చేస్తున్నట్టుగా తాను తెలిపారు. సో బాలయ్య నెక్స్ట్ కోసం మరోసారి తన హిట్ దర్శకుడు వర్క్ చేయనున్నాడని చెప్పాలి.