టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. భీష్మ లాంటి సాలిడ్ హిట్ తర్వాత నితిన్, వెంకీ నుంచి అనౌన్స్ అయ్యిన సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అయితే హిట్ అందుకోలేదు.
మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం థియేటర్స్ లో రన్ ని కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటిటి విడుదల తేదీ లాక్ అయ్యింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మే 2 నుంచి అందుబాటులోకి రాబోతుంది.