ఫైనల్‌ కాపీని లాక్‌ చేసుకున్న కల్యాణ్‌ రామ్‌ మూవీ!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు చిలుకూరి ప్రదీప్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రిలీజ్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ముగించుకుంటున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీని కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ ఫైనల్ కాపీని చూసి పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని యాక్షన్, ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఖాయమని వారు తెలిపారు.

ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సోహైల్ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories