తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ వేసవి కానుకగా మే 1న వరల్డ్‌వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బారజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇక ఇప్పుడు ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.
‘రెట్రో’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో సూర్య తన స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను తొలుత అందరూ ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ అని అనుకున్నారు. కానీ, ఇదొక లవ్ స్టోరీ అని.. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండే ప్రేమకథ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ క్లారిఫికేషన్ ప్రేక్షకుల ముందుకు తీసుకని వచ్చాడు.
ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2D ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.