ఆ మూవీ కోసం టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్న సందీప్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ‘స్పిరిట్’ అనే పవర్‌ఫుల్ కాప్ స్టోరీని సందీప్ రెడ్డి రెడీ చేస్తున్నాడు.

అయితే, ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఓ  టార్గెట్‌ ని ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. స్పిరిట్ చిత్రాన్ని సందీప్ రెడ్డి కేవలం 120 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఇక ఇందులో ప్రభాస్ ఏకంగా 90 రోజుల పాటు షూటింగ్ చేసేలా ఆయన ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని లుక్‌లో చూపెట్టేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట.

మరి నిజంగానే ‘స్పిరిట్’ చిత్రాన్ని అంత తక్కువ వ్యవధిలో సందీప్ రెడ్డి వంగ పూర్తి చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories