కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రమే ‘రెట్రో’. అటు తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ సహా ఆడియోకి కూడా సమయం దగ్గర పడగా ఇపుడు ఫైనల్ గా ఈ చిత్రం రన్ టైం అయితే బయటికి వచ్చింది.
ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 168 నిమిషాలు అంటే రెండు గంటల 48 నిమిషాల నిడివితో కట్ చేశారు అని చెప్పాలి. ఒకింత రన్ టైం పెద్దదే కానీ కథనం అనుకున్న రేంజ్ లో ఎంగేజింగ్ గా ఉంటే డెఫినెట్ గా ఇంప్రెస్ చేస్తుంది అని టాక్ వినపడుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ లో మొత్తం 8 కట్స్ పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మే 1 వరకు ఆగాల్సిందే.