జాట్‌ పై బిగ్‌ అనౌన్స్ మెంట్‌!

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమాకి మన తెలుగు సినిమా మేకర్స్ అందించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే “జాట్”. బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కించిన ఈ చిత్రం సన్నీకి మంచి హిట్ గా నిలిచి సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. ఇలా 100 కోట్ల మార్క్ దిశగా ఈ సినిమా వెళుతుండగా మేకర్స్ ఓ బిగ్ అనౌన్సమెంట్ ని సర్ప్రైజింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి దీనితో ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ 2 కూడా ఉంటుంది అని మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఈ సాలిడ్ అనౌన్సమెంట్ పట్ల అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. మరి సన్నీ డియోల్ నుంచి సీక్వెల్ అంటే దానికి భారీ మార్కెట్ ఉంటుదనే సంగతి తెలిసిందే. జాట్ ఇంకొంచెం గట్టి ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ ని అందుకునేదని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories