కారణం అదా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు బాలీవుడ్ లో భారీ చిత్రం వార్ 2 చేస్తున్న విషయం తెలిసిందే.. మరి ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అలాగే కొరటాల శివతో దేవర పార్ట్ 2 లని చేయనున్నాడు. అయితే ఇటీవల గమనించినట్టు అయితే తారక్ లో చాలా మార్పు తెలుస్తుంది. తారక్ చాలా చిక్కిపోయి సన్నగా కనిపించడం జరిగింది.

అయితే ఇదంతా ఊరికే జరిగింది కాదట. తాను తన తరువాత మూవీ కోసమే ఈ లుక్ ని రెడీ  చేస్తున్నట్టుగా సమాచారం. సో ఎన్టీఆర్ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. మరి ఈ లుక్ లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాల్సిందే మరి. ఇక ఈ చిత్రానికి హోంబళే ఫిల్మ్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే తారక్ షూటింగ్ సెట్స్ లో దిగనున్నాడు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9 విడుదల తేదీ ఉన్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories