ఆయనేమీ రాజ్యాంగానికీ, చట్టానికీ అతీతమైన శక్తి కాదు. ఎంత గొప్ప పదవులు వెలగబెట్టినా కూడా అన్నీ చట్టానికి లోబడినట్టివే. అయితే.. తనకు అధికారికంగా నోటీసులు వచ్చినప్పుడు ఆయన స్పందిస్తున్న తీరు మాత్రం.. ఆయనలోని అపరిమిత అహంకారానికి నిదర్శనగా ఉన్నదనే విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. ఆయన ఒక అక్రమానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు, ప్రాథమిక విచారణల్లో ఆ ఆరోపణలు సత్యమే అని తేలుతున్నప్పుడు.. ఆయన ద్వారా వివరణ తెలుసుకోవడం కోసం అధికారులుచేసే ప్రయత్నానికి ఆయన పెడసరపు జవాబులు ఇవ్వడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తే కావచ్చు గానీ.. వ్యవస్థను, చట్టాలను గౌరవించినప్పుడే.. ఆయన పెద్దరికానికి మర్యాద దక్కుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తిరుపతి నగరంలో భూఆక్రమణలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిమీద అనేక ఆరోపణలున్నాయి. బుగ్గమఠం భూముల ఆక్రమణకు సంబంధించిన వ్యవహారం ఇది. తిరుపతి ఎమ్మార్ పల్లి పరిధిలోని 3.88 ఎకరాల భూమి వారి కుటుంబం చేతిలో ఉంది. బుగ్గమఠం భూములు అన్యాక్రాంతం అయిన ఇదే వ్యవహారంలో డేగల మునస్వామి, పట్టెం వెంకటరాయలు, యశోదమ్, పురంధర్ అనే వ్యక్తలకు కూడా బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు విచారణకు రావాలని ఈనెల 11న నోటీసులు ఇచ్చారు. వేర్వేరు కారణాలు చూపించి విచారణకు రాలేం అని వారు చెప్పారు. ఏప్రిల 3న ఇచ్చిన కూడా ఒకసారి నోటీసులు ఇచ్చినా వారు రాలేదు. ఇదే వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని 17న విచారణకు రావాలని నోటీసులు ఇస్తే.. ఆయన ‘‘నేను ప్రజాప్రతినిధిని, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా మీరు చెప్పిన రోజు హాజరు కాలేను’ అంటూ ఆయన పెడసరపు జవాబు పంపారు. పైగా బుగ్గమఠం ఈవో నోటీసు చాలా ఫ్లెక్సిబుల్ గానే ఉంది. స్వయంగా పెద్దిరెడ్డి రావాలనే ఆదేశం అందులో లేదు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపి.. ఆక్రమణకు గురైన ఉన్న తమ మఠంభూములకు సంబంధించి మీవద్ద ఉన్న రికార్డులు ఇవ్వాలని మాత్రమే అడిగారు. పెద్దిరెడ్డి తాను చెబుతున్నట్టుగా ఆయన ప్రజాప్రతినిధి గనుక.. రాలేని పరిస్థితి ఉంటే నోటీసుల్లో కోరినట్టుగా ప్రతినిధి ద్వారా రికార్డులు పంపవచ్చు. కానీ.. ఆ భూముల్ని తన తమ్ముడు ద్వారకనాధరెడ్డి కొన్నారని చెప్పారే తప్ప.. రికార్డులు పంపే ప్రయత్నం చేయలేదు.
అటవీభూములను, మఠం భూములను, ప్రెవేటు వ్యక్తుల భూములను తనకు కంటికి యింపుగా కనిపిస్తే ఆ భూములు ఎవరివి అనే సంగతి పట్టించుకోకుండా కబ్జాలకు పాల్పడినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.