పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు రాజకీయాల్లో రెండింటిలోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఎంతోమంది అభిమానుల్లో తెలుగు సినిమా నుంచి కూడా ఉన్నారు. వారిలో నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. అయితే బండ్ల గణేష్ తో పవన్ గబ్బర్ సింగ్, తీన్ మార్ సినిమాలు చేసిన సంగి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయ్యింది.
అయితే లేటెస్ట్ గా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి అకారణంగా థాంక్స్ చెప్పినట్టుగా పెట్టిన పోస్ట్ అభిమానుల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. పవన్ కి ధన్యవాదాలు తెలుపుతూ తీన్ మార్ పోస్టర్ ని పెట్టుకున్నారు. దీంతో బండ్ల ఎందుకు థాంక్స్ చెప్పినట్టు? ఎందుకు ఈ పోస్టర్ పెట్టినట్టు అని అభిమానులు తికమకపడుతున్నారు. కొన్నాళ్ల నుంచి తీన్ మార్ రీరిలీజ్ కోసం చర్చలు నడుస్తున్నాయి. మరి దీన్ని బండ్ల గణేష్ సిద్ధం చేసారో ఏమో అని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.