నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మొదటి భాగానికి సీక్వెల్ గా వస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో దీనిపై సాలిడ్ బజ్ నెలకొంది. అయితే ఈ చిత్రం కోసం బోయపాటి శ్రీను మరింత కేర్ ని స్క్రిప్ట్ నుంచి చాలా అంశాల్లో తీసుకుంటున్నారు.
ఇక బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒక సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంటుంది. ప్రతీ సినిమాకి కూడా కొత్త కొత్త యాక్షన్ ఎపిసోడ్స్ ని తాను డిజైన్ చేయించి ఉంచుకుంటారు. ఇలా అఖండ 2 యాక్షన్ సీక్వెన్స్ లపై కూడా క్రేజీ టాక్ ఒకటి వినపడుతుంది. దీనితో ఈ మొత్తం సినిమాకి నాలుగు స్టంట్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారట.
రామ్ లక్ష్మణ్ సోదరులు అలాగే పీటర్ హెయిన్ సహా మరో ప్రముఖ స్టంట్ మాస్టర్ రవి వర్మలు అఖండ 2లో యాక్షన్ లు తెరకెక్కిస్తున్నారట. అయితే వీరిలో రవి వర్మతో బోయపాటి మరింత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో సరైనోడు లో కూడా రవివర్మ సాలిడ్ వర్క్ అందించారు. రామ్ చరణ్ తో ధృవ సినిమాకి కూడా తాను వర్క్ చేశారు. సో ఇలా అఖండ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వేరే లెవెల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.