ఇంకా ఎన్నిరోజులు సార్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా  ‘హరిహర వీరమల్లు’.  ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ చూస్తే తెలిసిపోతుంది.

అయితే, ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు విడుదల తేదీ వాయిదా వేసుకుని, ఈ వేసవి కానుకగా మే 9న గ్రాండ్ గా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ డేట్‌లో కూడా హరిహర వీరమల్లు విడుదల కావడం అనుమానమే అని తెలుస్తోంది. ఇంకా సినిమా పనులు పెండింగ్ ఉన్నాయని.. అందుకే ఈ సినిమాను మే 9న విడుదల చేయడం లేదని చిత్ర వర్గాల ఇన్‌సైడ్ టాక్‌ నడుస్తుంది.

ఈ లెక్కన ఈ చిత్రం ఇంకెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆనందంగా  ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories