వారెవ్వా.. తోపుదుర్తికి సరైన పదవి ఇచ్చిన జగన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి కూడా ఒకరు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటించినప్పుడు.. పోలీసుఅలు పెట్టిన నిబనంధనలను అన్నింటినీ ఉల్లంఘించి.. జనాన్ని హెలిప్యాడ్ వద్దకు కూడా తోలించి హంగామా చేసిన వ్యక్తి తోపుదుర్తి! తాము చేస్తున్న రభసకు పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయడంలో కఠినంగా వ్యవహరించరనే నమ్మకంతో.. జనాన్ని రెచ్చగొట్టి హెలిప్యాడ్ మీదకు తోలించిన నాయకుడు తోపుదుర్తి! ఆ ఫలితం.. హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతినడం.. జగన్ వేరే గతిలేక రోడ్డు మార్గంలో బెంగుళూరుకు వెళ్లవలసి రావడం జరిగింది. జనాన్ని రెచ్చగొట్టి పోలీసులమీదికి రాళ్లతో దాడిచేయించిన వ్యక్తి తోపుదుర్తి! అందుకు ఆయన మీద పోలీసు కేసు కూడా నమోదు అయింది. మరి ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పుడు.. తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి సేవలను ఘనంగా సత్కరించుకోకపోతే ఎలాగ? అందుకే ఆయనకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో సముచితమైన పదవి ఇచ్చి గౌరవించారు. తోపుదుర్తిని క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేశారు.

ఎవ్వరైతే క్రమశిక్షణ పరంగా అత్యంత అరాచకంగా వ్యవహరిస్తూ ఉంటారో.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, పదవినుంచి ప్రజలు దించేసిన తర్వాత.. తన డిక్షనరీలో క్రమశిక్షణ అనే పదమే లేనట్టుగా అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే వ్యక్తిని ఏరికోరి మరీ.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం అంటే.. జగన్ ఎలాంటి వ్యూహ చాతుర్యంతో పార్టీని నడుపుతున్నారో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని జగన్ పునర్ వ్యవస్థీకరించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా రీజినల్ కోఆర్డినేటర్లు ఉంటారు. అదే సమయంలో.. జగన్.. సజ్జల రామక్రిష్ణారెడ్డిని లూప్ లైన్లోకి పెడుతున్నారనే గుసగుసలు పార్టీలో సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో.. ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ.. పీఏసీకి కన్వీనర్ గా సజ్జలనే ప్రకటించారు. తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, అవినాష్ రెడ్డి, కొడాలి నాని, ఆర్కేరోజా, బుగ్గన, సాకే శైలజానాధ్ తదితరులు 33 మందితో ఈ పీఏసీ కమిటీ ఏర్పాటు అయింది.

తాజా నియామకాలతో పార్టీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. పార్టీకి జవజీవాలు ఇచ్చే వారు ఈ అడ్వయిజరీ కమిటీలో ఉన్నారా? అనే చర్చ నడుస్తోంది. అలాగే.. తోపుదుర్తి చేతికి క్రమశిక్షణ పగ్గాలు ఇవ్వడం ద్వారా.. పార్టీ లో ఏమాత్రం క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం లేదని.. ఎంత రెచ్చిపోయినా సరే.. వారిని సమర్థించడానికి అంతకంటె ఎక్కువగా రెచ్చిపోతుండే వ్యక్తిచేతికే పగ్గాలు ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories