మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్లో రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది.
కాగా, ఈ సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్ చిత్రాలను ఓకే చెప్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష్యం, లౌక్యం చిత్రాల దర్శకుడు శ్రీవాస్ రవితేజ కోసం ఓ సాలిడ్ కథను రాసుకున్నాడట. అది రవితేజకు వినిపించాడని.. ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ కథను యంగ్ హీరో సందీప్ కిషన్‌కు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.