మరో ట్రీట్‌ తో దేవర..కానీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. తారక్ నుంచి సోలోగా వచ్చిన ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లు అందుకొని తన కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక రీసెంట్ గానే ఈ చిత్రం జపాన్ లో కూడా విడుదల అయ్యింది.

ఇలా విడుదల అప్పటి  నుంచి ఇపుడు వరకు ఏదోక సందర్భంలో వినిపిస్తూ వస్తున్న దేవర ఇపుడు అభిమానులకి మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకి ఇచ్చిన పాటలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. మరి ఇపుడు ఈ సినిమా అవైటెడ్ ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ని మేకర్స్ రిలీజ్ చేసేశారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనంద పడ్డారు కానీ ఇంతలోనే థియేటర్స్ లో ఉన్న మరికొన్ని హిట్ ట్రాక్స్ లో ఇందులో మిస్ అయ్యాయి అని డిజప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 16 ట్రాక్స్ ని మాత్రమే రిలీజ్ చేయగా వీటిలో తాము అనుకున్నవి కొన్ని లేవు అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories