తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆమె దందాలు మొదలెట్టేశారు. తన నియోజకవర్గ పరిధిలోని వ్యాపారుల నుంచి కోట్లకు కోట్లు దండుకోవడానికి ప్రయత్నించారు. అయినంతవరకు పిండుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని నియోజకవర్గనం మార్చుకని లక్ చెక్ చేసుకున్న ఆమెను గుంటూరు వెస్ట్ లో కూడా ప్రజలు ఛీత్కరించారు. దీంతో తిరిగి చిలకలూరిపేటకు చేరి ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి విడదల రజని.. ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదరించి రెండు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి ఉన్నారు. ఇదే కేసులో మరో కీలక నిందితుడు ఐపీఎస్ అధికారి జాషువా హైకోర్టును ఆశ్రయించారు. విడదల రజని దందాల్లో కీలక పాత్ర ఆయనదే అయినప్పటికీ.. తన మీద ఏసీబీ కేసును కొట్టివేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే విచారణలో ఏ2 జాషువా తీరుపట్ల హైకోర్టు స్పందించిన శైలి, చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ఏ1 విడదల రజనికి ముందస్తు బెయిలు రావడం కూడా అంత ఈజీ కాదని, ఆమె కోరిక నెరవేరదని అర్థమవుతోంది.
జాషువా పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తులు స్పందిస్తూ.. ఐపీఎస్ అధికారిగా ఉంటూ.. స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించడంలో రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మగా ఎలా మారారని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకుల మధ్య వైరంలో ఆయనను ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ప్రాసిక్యూషన్ వారి వాదనలు కూడా వినకుండా.. అరెస్టునుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఆశించవద్దంటూ కోర్టు హెచ్చరించింది.
స్టోన్ క్రషర్ యమజానుల్ని 5 కోట్ల రూపాయలు తనకు లంచంగా ఇవ్వాల్సిందిగా విడదల రజని బెదిరించడం.. ఆ తర్వాత జాషువా తన సిబ్బందితో ఆ క్రషర్ మీద దాడిచేసి తనిఖీలు నిర్వహించి.. కేసులు పెడతామని.. 50 కోట్ల జరిమానాలు వేస్తామని.. తప్పించుకోవాలంటే మేడం వద్దకు వెళ్లి సెటిల్ చేసుకోవాలని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఆ స్టోన్ క్రషర్ యజమానులు 2 కోట్ల రూపయాలు రజని మరిదికి ఇచ్చి సెటిల్ చేసుకున్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ వ్యవహారం మొత్తం కేసులు నమోదు అయింది. మామూలుగా వైసీపీ తరఫున ప్రెస్ మీట్లు పెడుతూ.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఇంతకింత వడ్డీతో సహా చెల్లించుకుంటాం.. అంటూ తెలుగుదేశం నాయకుల్ని వేలు చూపించి బెదిరించే విడదల రజని ఇప్పుడు అరెస్టు భయంతో గడుపుతున్నారు. ఆమె ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఇదేకేసులో ఏ2 ఇప్పుడు అరెస్టు నుంచి రక్షణ కోరగా.. కోర్టు ఇప్పటికి నిరాకరించింది. మొత్తానికి జగన్ పాలనకాలంలో చేసిన పాపాలకు జైలుకు వెళ్లబోతున్న తొలి మాజీ మహిళా మంత్రి విడదల రజని అవుతుందని అంతా అనుకుంటున్నారు.