థీమ్‌ సాంగ్‌ తో జాట్‌!

దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘జాట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి్ంచడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ పాత్ర అల్టిమేట్ యాక్షన్ రోల్‌లో ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా రణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రెజీనా కాసాండ్ర, సయ్యామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories