ఒక్క షాట్‌ కే క్రేజీ రీచ్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “పెద్ది”. రామ్ చరణ్ కెరీర్ 16వ సినిమాగా ఒక సాలిడ్ మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడు అనేది లేటెస్ట్ గ్లింప్స్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ రామ నవమి కానుకగా దింపిన పెద్ది ఫస్ట్ షాట్ చూసి అందరికీ ఓ రేంజ్‌ లో మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది అంతే.

మెయిన్ గా గ్లింప్స్ చివరిలో షాట్ అయితే ఆఫ్ లైన్ గట్టి రీచ్ నే సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. రామ్ చరణ్ అలా బ్యాట్ కిందకి గుద్ది పట్టు సవరించి బాల్ ని కొట్టే సన్నివేశాన్ని ఆఫ్ లైన్ లో యువత గట్టిగా ఫాలో అవుతూ రీల్స్ చేసేస్తున్నారు. దీంతో పెద్ది సినిమాకి కావాల్సిన హైప్ రీచ్ రెండూ ఈ ఒక్క ఫస్ట్ షాట్ తో వచ్చేసాయి అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories