అఖిల్ కొత్త మూవీ అప్ డేట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి ఈ టైటిల్ గ్లింప్స్‌ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ షెడ్యూల్‌ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అఖిల్ పై యాక్షన్ సీన్స్ ను తీస్తున్నారు.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక సినిమాను ‘లెనిన్’ అనే టైటిల్‌తో రూపొంచబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories